‘మిరాయి’లో విలన్‌గా నటించి మిరాకిల్ సక్సెస్‌ని అందుకున్నారు మంచు మనోజ్. ఆ సినిమా విజయంలో మనోజ్ పాత్ర కీలకం అని చెప్పడంలో సందేహించాల్సిన పనిలేదు. ‘మిరాయి’ విజయం తర్వాత ఆఫర్లు పోటెత్తినా, ఆచీతూచీ సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు మనోజ్. ఈ నేపథ్యంలో ఓ అద్బుతమైన అవకాశం ఆయన తలపు తట్టిందనేది ఫిల్మ్‌నగర్ టాక్. ‘NBK111’(వర్కింగ్ టైటిల్)లో కీలకమైన పాత్ర కోసం దర్శకుడు మలినేని గోపీచంద్ ఇటీవలే మంచు మనోజ్‌ని కలిశారట.
బాలకృష్ణ సినిమాలో ప్రత్యేక పాత్ర అనగానే మారు మాట్లాడకుండా అగ్రిమెంట్‌పై సంతకం చేశారట మంచు మనోజ్. ముంబయ్ అండర్‌వరల్డ్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన ప్రధాన విలన్‌గా నటిస్తున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ సినిమాలో మెయిన్ విలన్‌గా చేసే అవకాశం రావడమంటే నిజంగా అది జాక్‌పాటే. గతంలో మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంలో బాలకృష్ణ ఓ స్పెషల్ రోల్లో నటించిన విషయం తెలిసిందే.