హైదరాబాద్, మార్చి 5(నమస్తే తెలంగాణ): 2026-27 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పూర్తిచేయకుం డానే ముందస్తుగా అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్న ప్రైవేట్ కళాశాలలపై చర్య లు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఇంటర్‌బోర్డు జాయింట్ కార్యదర్శి వసుంధర దేవికి ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు ఫిర్యా దు చేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్రలు మాట్లాడు తూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ లేకుండానే ముందస్తుగా అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాలేజీల గుర్తింపు ఒకచోట, తరగతులు మరో చోట నిర్వహించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.