Wamiqa Gabbi | టాలీవుడ్ నుంచి రానున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ ఒకటి. బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తుండగా, యంగ్ హీరో తేజ సజ్జ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ గ్యాప్ తర్వాత ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పౌరాణిక సూపర్‌హీరో చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలాఉంటే, ఈ సినిమాకి సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ట్రెండింగ్ బ్యూటీ వామికా గబ్బి ‘జై హనుమాన్’ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కోలీవుడ్ హిట్ చిత్రం ‘డిసి’ లో తన అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసిన వామికా.. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానుందనే వార్త అభిమానులను ఎంతగానో ఉత్సాహపరుస్తోంది. విభిన్న నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న వామికా గబ్బి ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించనుందని సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.