‘స్కాలర్షిప్స్ సాధనకై ఈ 13న జరిగే ఛలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయండి’
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కొరకై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13న జిల్లాలో జరిగే ఛలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద నాగకృష్ణ పిలుపునిచ్చారు.
కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 11 : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కొరకై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13న జిల్లాలో జరిగే ఛలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద నాగకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10,814 కోట్లు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో ఉన్నాయని తక్షణమే వాటిని విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయిబర్స్మెంట్స్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో నిధులు అందలేదని విమర్శించారు. ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో ఆ భారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మోపడం అన్యాయమన్నారు.
విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచాలంటే స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేసే విధంగా, శాశ్వతమైన నిధుల విడుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ నాయకులు నాహిద్ పాషా, శ్రావణ్, మాహీర్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

