Bihar | బిహార్ జముయిలో బాలికపై వేధింపుల ఘటన.. ఎన్కౌంటర్లో నిందితుడికి గాయాలు
Bihar : బిహార్లోని జముయిలో బాలికపై కొందరు దుండగులు వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో కీలక నిందితుడు ఎన్కౌంటర్లో గాయపడ్డాడు.
Bihar : బిహార్లోని జముయిలో బాలికపై కొందరు దుండగులు వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో కీలక నిందితుడు ఎన్కౌంటర్లో గాయపడ్డాడు. నందన్ యాదవ్ అనే ప్రధాన నిందితుడి కాలుపై పోలీసులు కాల్పులు జరపగా.. అతడు గాయపడ్డాడు. సెప్టెంబర్ 19న బిహార్లోని జముయిలో ఒక బాలుడు, బాలిక రాత్రి పూట కోచింగ్ నుంచి తిరిగి వస్తున్నారు.
అయితే, వీరిని కొందరు యువకులు అడ్డుకున్నారు. ఇద్దరిపై వేధింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక దాడికి దిగారు. ఈ ఘటనలో బాలికపై దాడిని ఆ వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతడిపై కూడా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు స్పందించారు. అయితే, బాధితుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్తానిక పోలీసులు తెలిపారు. వీడియో వైరల్గా మారిన తర్వాత నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా గుర్తించారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కోసం పోలీసులు సిట్ (ప్రత్యేక విచారణ బృందం) ఏర్పాటు చేశారు.
ఈ ఘటనకు పాల్పడిన వారిలో నందన్ యాదవ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఘటన జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతుండగా ఒక చోట అతడు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడి కాలిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. నందన్ యాదవ్కు ఇతర అక్రమ వ్యాపారులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Encounter
- Jamui
- Nandan Yadav
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

