Striat of Hormuz | హర్మూజ్ జలసంధిలో మళ్లి ఉద్రిక్తతలు.. గ్యాస్ ట్యాంకర్‌పై దాడి..!
Striat of Hormuz | ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఒక ఎల్పీజీ ట్యాంకర్ (LPG Tanker) పై గుర్తుతెలియని వస్తువులతో దాడి జరిగింది. ఈ ఘటనలో ట్యాంకర్‌ను కొన్ని శిథిలాలు తాకినట్లు యునైటెడ్ కింగ్డమ్ (UK) మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది.
Striat of Hormuz : ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఒక ఎల్పీజీ ట్యాంకర్ (LPG Tanker) పై గుర్తుతెలియని వస్తువులతో దాడి జరిగింది. ఈ ఘటనలో ట్యాంకర్‌ను కొన్ని శిథిలాలు తాకినట్లు యునైటెడ్ కింగ్డమ్ (UK) మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ట్యాంకర్ మాస్టర్ (Tanker Master) నుంచి సమాచారం కొంత ఆలస్యంగా అందింది.
అయితే ఈ దాడిలో సిబ్బందికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని పర్యావరణానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లలేదని యూకేఎంటీవో స్పష్టంచేసింది. ప్రస్తుతం ఆ ట్యాంకర్ సురక్షితంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తదుపరి పోర్టుకు చేరుకుంటోందని అధికారులు తెలిపారు. అదేరోజున మరో ట్యాంకర్‌పై కూడా ఇటువంటి దాడి జరిగినట్లు యూకేఎంటీవో పేర్కొన్నది. ఆ ఘటనలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.
అయితే ఆ నౌకకు ఎటువంటి తీవ్రనష్టం జరగలేదని, అది తన ప్రయాణాన్ని యథావిధిగా కొనసాగిస్తోందని అధికారులు వెల్లడించారు. వరుస దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని యూకేఎంటీవో సూచించింది. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

