– సర్ తో 9,963 ఓట్లు గల్లంతు
ఖమ్మం రూరల్, ఆగస్టు 11 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ అనంతరం ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీతో కలిపి మొత్తం 84,855 మంది ఓటర్లు ఉన్నట్లుగా తేలింది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు సంబంధిత ఎన్నికల అధికారుల గణాంకాల ప్రకారం ఈ వివరాలు తెలిసింది. పాలేరు నియోజకవర్గంలో సర్ ప్రక్రియకు సంబంధించి జిల్లాలోనే అగ్రస్థానంలో ఉంది. మొత్తం ఓటర్లలో 92.19 % ఓట్ల నమోదు పూర్తి అయింది. గతంలో ఉన్న ఖమ్మం రూరల్ మండల పరిధిలో మొత్తం ఓటర్లు 94,818 మంది ఓటర్లు ఉండగా ఓటర్ జాబితా సవరణ సర్ ప్రక్రియ అనంతరం 84,855 మంది ఓటర్లుగా నిర్ధారణ అయింది. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలంతో కలిపి మొత్తం పోలింగ్ స్టేషన్లో 101 గా ఉన్నాయి.
సర్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. తాజా గుణాంకాల ప్రకారం 9,963 ఓట్లు గల్లంతు అయ్యాయి. వీటిలో 2,057 మంది ఓటర్లు చనిపోయినట్లుగా నిర్ధారణ కాగా మరో 7,203 ఓట్లు తమ సొంత ప్రాంతాలకు పర్మినెంట్ షిఫ్ట్గా నమోదైనట్లు తెలుస్తుంది. మరికొందరు ఎనిమిరేషన్ ఫారాలను అధికారులకు ఇవ్వకపోవడంతో మొత్తంగా సుమారు 10 వేల ఓట్లు తొలగించబడ్డట్టు తెలుస్తుంది. పూర్తి ప్రక్రియ అనంతరం ఈ గణాంకాలలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం కనబడుతుంది.