Chaos In J&K Assembly | స్వయంప్రతిపత్తితో కూడిన రాష్ట్ర హోదా కల్పించాలన్న ఒమర్ అబ్దుల్లా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల రగడ
Chaos In J&K Assembly | జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తితో కూడిన రాష్ట్ర హోదా కల్పించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు దీనిని వ్యతిరేకించారు. సభ మధ్యలోకి దూసుకెళ్లి హంగామా చేశారు. మైక్రోఫోన్లు విసిరేందుకు ప్రయత్నించడంతో సభలో గందరగోళం చెలరేగింది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తితో కూడిన రాష్ట్ర హోదా కల్పించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు దీనిని వ్యతిరేకించారు. సభ మధ్యలోకి దూసుకెళ్లి హంగామా చేశారు. మైక్రోఫోన్లు విసిరేందుకు ప్రయత్నించడంతో సభలో గందరగోళం చెలరేగింది. (Chaos In J&K Assembly) శుక్రవారం ఒమర్ అబ్దుల్లా ప్రవేశపెట్టిన రాష్ట్ర హోదా తీర్మానంలో, ఆర్టికల్స్ 370, 35ఏ పునరుద్ధరణను చేర్చాలని కోరుతూ అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యేలతో సహా పలువురు సభ్యులు సోమవారం సవరణ తీర్మానాలను ప్రవేశపెట్టారు. 2000లో ప్రవేశపెట్టిన స్వయంప్రతిపత్తి తీర్మానాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు.
కాగా, ఈ తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ‘దేశ వ్యతిరేక, పాకిస్థానీ ఎజెండా’ అని ఆరోపించారు. తీర్మానం ప్రతులను చించివేశారు. సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రథర్‌ను తొలగించాలని నినాదాలు చేశారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలంతా సభ మధ్యలోకి దూసుకెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైకి మైక్రోఫోన్లు విసిరేందుకు ఒక బీజేపీ ఎమ్మెల్యే ప్రయత్నించారు. ఆ తర్వాత, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కూడా సభ మధ్యలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు బీజేపీ సభ్యులను బయటకు పంపివేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా బీజేపీ సభ్యులు మళ్లీ సభ మధ్యలోకి దూసుకెళ్లారు. ‘దేశ విభజనను మేం అనుమతించం’ అంటూ నినాదాలు చేశారు.
అయితే సీఎం ఒమర్ అబ్దుల్లా బీజేపీపై మండిపడ్డారు. గత రెండేళ్లుగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు స్థానిక బీజేపీ నాయకత్వం వ్యతిరేకమని, వారి అసలు స్వరూపం బయటపడిందని ఆయన ఆరోపించారు. ‘ఈ తీర్మానం కేవలం రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించినది. జమ్ముకశ్మీర్ ప్రజల నిజమైన శత్రువులు ఎవరో కూడా ఈ తీర్మానం బయటపెడుతుంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణను ఎవరు కోరుకుంటున్నారు, ఎవరు దానికి వ్యతిరేకంగా ఉన్నారు? రాష్ట్ర హోదా అనేది నా ప్రభుత్వం కోసం లేదా నా పార్టీ కోసం కాదు. ఇది జమ్ముకశ్మీర్ అస్తిత్వం, ప్రజల కోసం’ అని ఆయన అన్నారు. దేశం కోసం తమ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని, తమకు బీజేపీ నుంచి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

