లక్నో: ఒక లబ్ధిదారుడు వీల్‌చైర్‌లో కూర్చొని ఎమ్మెల్యే నుంచి దానిని అందుకున్నాడు. ఆ తర్వాత ఆ మడతపెట్టిన వీల్‌చైర్‌ను తోసుకుని నడుచుకుంటూ వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Beneficiary Walks After Receiving Wheelchair) దీంతో లబ్ధిదారుల ఎంపికపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 20న లంబువా బ్లాక్ ప్రాంగణంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సీతారాం వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక లబ్ధిదారుడికి వీల్‌చైర్ అందజేశారు.
కాగా, ఎమ్మెల్యేతో ఫొటో దిగిన తర్వాత ఆ వీల్‌చైర్‌ను మడతపెట్టారు. ఆ లబ్ధిదారుడు దానిని తోసుకుని నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు అధికారులతోపాటు ఎమ్మెల్యే సీతారాం వర్మ దీనిపై వివరణ ఇచ్చారు. బంకేపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు సందీప్‌కు వీల్‌చైర్ మంజూరైనట్లు తెలిపారు. అనారోగ్యం వల్ల ఆ లబ్ధిదారుడు హాజరుకాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి తండ్రి రామ్ ధనికి ఆ వీల్‌చైర్‌ను అందజేసినట్లు వివరించారు. దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతున్నదని ఆరోపించారు.
అయితే ముందస్తు సమాచారం, సరైన ప్రచారం లేకపోవడం వల్ల అర్హులైన వికలాంగులు లబ్ధి పొందలేకపోతున్నారని స్థానికులు ఆరోపించారు.
Miraculous wheel chair being distributed by BJP MLA Sitaram in Sultanpur, #UttarPradesh(Ram Rajya). The moment you get up after sitting on it, your legs become perfectly alright. 😁 pic.twitter.com/AGID3yV6Mz
— SDutta (@KhelaHobePart2) December 21, 2025
Also Read:
victory procession turns into blaze | విజయోత్సవ ఊరేగింపులో చెలరేగిన మంటలు.. 16 మందికి కాలిన గాయాలు
Girl Kills Father With Lover | తండ్రికి నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడితో చంపించిన బాలిక
Watch: హాస్పిటల్ వార్డులో రోగి, డాక్టర్ మధ్య కోట్లాట, పిడిగుద్దులు.. వీడియో వైరల్
Watch: మహిళను ఢీకొట్టిన ఆటో.. తర్వాత ఏం జరిగిందంటే?