రాష్ట్రంలో అరాచక పాలన
కేసీఆర్ హయంలో హైదరాబాద్‌లో లక్ష డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఏండ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నవారిని ఇటీవల ప్రభుత్వ అధికారులు సంబంధిత స్థలం ప్రభుత్వానిది అని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి
- హనుమాన్‌నగర్ వాసులకు అండగా ఉంటామని హామీ
బండ్లగూడ, మార్చి 11: కేసీఆర్ హయంలో హైదరాబాద్‌లో లక్ష డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఏండ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నవారిని ఇటీవల ప్రభుత్వ అధికారులు సంబంధిత స్థలం ప్రభుత్వానిది అని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఈ క్రమంలో బాధితులు ఎమ్మెల్యే సబితారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఆమె బుధవారం హనుమాన్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో మూడున్నర లక్షల డబుల్బెడ్రూంల ఇండ్ల నిర్మాణం చేస్తే.. రేవంత్‌రెడ్డి ఐదేళ్లలో లక్ష ఇండ్లను కూల్చడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. వస్తుంది. హనుమాన్ నగర్ వాసులు భయపడవద్దని.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్, నాయకులు.. సుభాష్‌రెడ్డి, నరేందర్, రఘు యాదవ్, సూర్యం, కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

