Epic Movie | ‘బేబీ’ కాంబినేషన్ రిపీట్: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల ‘ఎపిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Epic Movie | టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ, కథానాయిక వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'.
Epic Movie | టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ, కథానాయిక వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘బేబీ’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ఈ విజయవంతమైన కాంబినేషన్ మళ్లీ కలిసి నటిస్తుండటంతో సినిమాపై మొదటినుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు.
సూపర్ హిట్ వెబ్ సిరీస్ ’90స్ – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’తో గుర్తింపు పొందిన ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. అత్యంత అందమైన ప్రయాణాలు చాలా సాధారణ క్షణాలతోనే ప్రారంభమవుతాయి అనే క్యాప్షన్తో విడుదల చేసిన పోస్టర్లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలర్ఫుల్ లుక్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ నటించిన రణబాలి సినిమా కూడా సెప్టెంబర్లోనే విడుదల కాబోతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయితే అన్నదమ్ములు తొలిసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నారు. అయితే రష్మిక మందన్నాకు గాయం కావడంతో రణబాలి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

