‘ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి’
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలిచాలనీ వేతనాలతో పని చేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమయానికి జీతాలు చెల్లించాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్.హరికిషన్ రావు అన్నారు.
– ఎంజీయూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడు హరికిషన్ రావు
రామగిరి, ఆగస్టు 07 : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలిచాలనీ వేతనాలతో పని చేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమయానికి జీతాలు చెల్లించాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్.హరికిషన్ రావు అన్నారు. ఎంజీయూలో శుక్రవారం నిర్వహించిన ఆ సంఘం నూతన కమిటీ ఎన్నిక, జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో సమన్వయం చేసుకుని పనిచేస్తూనే ఎంజీయూ పనిచేసే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటి అధ్యక్షుడిగా ఆర్.హరికిషన్‌రావు, ఉపాధ్యక్షులుగా ఉమాదేవి, జనరల్ సెక్రెటరీగా విష్ణు, కోశాధికారిగా సరిత, కార్యవర్గ సభ్యులుగా విక్రం, నౌషిన్, శంకర్‌ను ఎన్నుకున్నారు. నూతన కమిటీని అభినందించి శాలువతో సత్కారించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.శేఖర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నిర్మల, జిల్లా కార్యదర్శి పి.నాగయ్య, ఇతర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

