రామగిరి, ఆగస్టు 07 : అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విశ్వవిద్యాలయ కళాశాల ఉపాధ్యాయుల సంస్థ (ఏఐఎఫయూసీటీవో) ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ ఎన్జీ కళాశాల ఎదుట అధ్యాపకులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచాలని, పాత పెన్షన్ విధానాన్ని పునర్ణురించాలని, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్స్ ప్రయోషన్లకు పీహెచ్ఎ తప్పనిసరి అనే నిబందన తొలగించాలని, యూనివర్సిటీల్లో ఎంఫిల్ కోర్సు పునర్దురించాలని, నీట్, క్యూసెట్ పరీక్షలను కేంద్రం నుంచి తప్పించి రాష్ట్రాలకే అప్పగించాలని, 7వ వేతన సంఘం ఎరియర్స్ తక్షణమే విడుదల చేయాలని, 8వ యూజీసీ వేతనం సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యోమం ఉద్భతం చేస్తామని వెల్లడించారు. ఈధర్నాలో జిల్లా అధ్యక్షుడు అనిల్ అబ్రహం, అధ్యాపకులు పరంగి రవికుమార్, బత్తిని నాగరాజు, అంతటి శ్రీనివాస్, మునిస్వామి, జ్యోత్స్న, మల్లేశం, శివరాణి పాల్గొన్నారు.