‘వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలతోనే సమగ్రాభివృద్ధి’
గ్రామ పంచాయతీల వాస్తవ అవసరాలు, స్థానిక వనరులను గుర్తించి పక్కా ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపట్టినప్పుడే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) విద్యా చందన అన్నారు. ఎన్.కె. నగర్ కమ్మ సత్రంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి...
– వీబీ జీ రామ్ జీ పథకంపై సర్పంచులు, పంచాయతీ సిబ్బందికి అవగాహన సదస్సు
చుంచుపల్లి, సెప్టెంబర్ 24 : గ్రామ పంచాయతీల వాస్తవ అవసరాలు, స్థానిక వనరులను గుర్తించి పక్కా ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపట్టినప్పుడే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) విద్యా చందన అన్నారు. ఎన్.కె. నగర్ కమ్మ సత్రంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు–VGPPs) పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో విద్యా చందన మాట్లాడుతూ… ‘వికసిత్ భారత్ @2047’ లక్ష్యానికి అనుగుణంగా గ్రామాల సమగ్రాభివృద్ధికి పంచాయతీ స్థాయిలో పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గతంలో 317 రకాల పనులకు అవకాశం ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 375కు పెరిగిందని తెలిపారు. అదేవిధంగా 100 రోజులు పని పది దినాలను 125 రోజులుగా పెంచారని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి 2027 జూన్ వరకు చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
మూడు ప్రధాన విభాగాల్లో అభివృద్ధి పనులు
వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల్లో ప్రధానంగా మూడు విభాగాలకు ప్రాధాన్యం ఉంటుందని డీఆర్డీవో వివరించారు.
మొదటిది – నీటి భద్రత : నీటి సంరక్షణ, నీటిని నిల్వ చేసుకునే చర్యలు, నీటి కుంటల ఏర్పాటు తదితర పనులు చేపట్టాలన్నారు.
రెండవది – గ్రామీణ మౌలిక వసతులు : పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు, పశువైద్య మౌలిక వసతులు తదితర అవసరమైన నిర్మాణాలను ప్రణాళికలో చేర్చాలని సూచించారు.
మూడవది – జీవనోపాధి : లైవ్లీహుడ్, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ముఖ్యంగా మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. అలాగే శ్రమతో కూడిన పనులకు ముందుకొచ్చే ప్రతి గ్రామీణ కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల పనిదినాల చట్టబద్ధ హామీ కల్పించే అంశాన్ని వివరించారు.
ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు
గ్రామాల అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయి నుంచి ప్రజల భాగస్వామ్యంతో రూపొందించాలని డీఆర్డీవో సూచించారు. గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, రైతులు, కూలీలు, మహిళలు, యువత అభిప్రాయాలను తీసుకుని అవసరాల ఆధారిత ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గ్రామంలోని ఆస్తులు, సహజ వనరులను అంచనా వేసి గ్యాప్ అనాలిసిస్ ద్వారా అభివృద్ధి లోటుపాట్లను గుర్తించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు, శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో డీఆర్డీవో, సీఈఓ, అడిషనల్ సీఈఓ, అడిషనల్ పీడీ (ఏపీఎస్), ఎంపీడీవోలు పాల్గొన్నారు. చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు మండలాలకు చెందిన సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్రస్థాయి సిబ్బంది హాజరయ్యారు.

‘వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలతోనే సమగ్రాభివృద్ధి’
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

