Stock Markets | పెరుగుతున్న ముడిచమురు ధరల ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు..!
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ్టి (గురువారం) ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూశాయి. పెరుగుతున్న ముడిచమురు ధరలు (Crude Oil Price), ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ప్రభావంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకంజవేశారు. దాంతో బ్యాంకింగ్, ఆర్థికరంగ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ్టి (గురువారం) ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూశాయి. పెరుగుతున్న ముడిచమురు ధరలు (Crude Oil Price), ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ప్రభావంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకంజవేశారు. దాంతో బ్యాంకింగ్, ఆర్థికరంగ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. సెన్సెక్స్ (Sensex) 1,247.71 పాయింట్లు నష్టపోయి 73,580.54 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 383.70 పాయింట్లు కోల్పోయి 23,063.10 వద్ద స్థిరపడింది.
అయితే ఈ మార్కెట్ పతనం ప్రధాన షేర్లకు మాత్రమే పరిమితం కాలేదు. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 2.25 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.53 శాతం నష్టపోయాయి. నిఫ్టీలో మూడు షేర్లు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయి ఒత్తిడి పెంచాయి. బ్యాంకింగ్, ఆర్థికరంగ షేర్లపై అమ్మకాల ప్రభావం ఎక్కువగా కనిపించింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు కూడా భారీగా నష్టపోయాయి.
పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఈ రంగంపై ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచాయి. మీడియా, ఫార్మా సూచీలు కూడా నష్టాల్లో ముగిసినా మిగతా రంగాలతో పోలిస్తే నష్టం తక్కువగా ఉంది. నిఫ్టీ 23,000 స్థాయిని నిలబెట్టుకోలేకపోతే 22,900-22,800 వరకు పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 23,200 స్థాయి తక్షణ నిరోధంగా ఉంటుందని పేర్కొన్నారు. ముడిచమురు ధరలు, ప్రపంచ బాండ్ మార్కెట్ పరిణామాలపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారని నిపుణులు అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

