గద్వాలటౌన్, మార్చి 11 : రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రభుత్వ దవాఖానల్లో రోగులపై వైద్యులు వహిస్తున్న నిర్లక్ష్య దోరణి కనిపిస్తూనే ఉంది.. జరగరాని ఆలస్యం జరిగి ప్రాణాలు పోయాకా తమ ప్రయత్నం తాము చేశామని మా తప్పేమీ లేదని చెప్పడం పరిపాటిగా మారింది.. డాక్టర్ సమస్యను ముందుగానే పసిగట్టలేడా..? రోగం..రోగి.. బిడ్డ పరిస్థితి కనిపెట్టలేని వైద్యులు తయారవుతున్నా రా..? ఒకటో నెల నుంచి బిడ్డ పుట్టబోయే వరకు ప్రతి నెలా స్కానింగ్ చేసి బిడ్డ పరిస్థితి చెప్పడం.. కాన్పు ఎప్పుడు చేయాలో నిర్ణయించడం సులభతరమైన ఈ రోజుల్లో బిడ్డ ఉమ్మనీరు తాగి కడుపులోనే మృతి చెందాడని చెబితే… నవ మోసాలు మోసిన తల్లి గర్భశోకాన్ని ఎవరు తీర్చ గలరు.. ఇందుకు ఎవరిని నింధించాలి…
బిడ్డ పరిస్థితిని ముందుగా పసిగట్టలేని డాక్టర్లనా? నెల నెలా వైద్య సేవలు అందించిన కింది ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలనా..? ఇదే ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా జిల్లా ప్రభుత్వ దవాఖానలో బుధవారం చోటు చేసుకుంది…అందుకు సంబంధించిన వివరాలు ఇలా.. గట్టు మండలం తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన మీనాక్షి రెండో సారి పురుడు పోసుకుంది. నెలలు నిండడంతో సోమవారం ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో మీనాక్షి బంధువులు ఆశ వర్కరు సాయంతో జిల్లా దవాఖానలో అదే రోజు చేర్పించారు. ఆమెను పరిశీలించిన డాక్టర్లు మందులు ఇచ్చారు. తరువాత మీనాక్షికి రాత్రి సమయంలో రెండు సార్లు నొప్పులు తీవ్రస్థాయిలో వచ్చాయి.
దీంతో ఆమె బంధువులు వెంటనే డాక్టర్లను సంప్రదించారు. అందుకు వారు ఇంజక్షన్లు మాత్ర మే ఇచ్చారు. దీంతో నొప్పులు తగ్గాయి. కాగా మంగళవారం తెలవారు జామున మీనాక్షికి డాక్టర్లు సీజెరియన్ చేశారు. అయితే అప్పటికే కడపులోనే శిశువు మృతి చెందింది. దీంతో డాక్టర్లపై మీనాక్షి బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోమవారం నొప్పులు ఎక్కువచ్చాయని చెప్పిన పట్టించుకోలేదని అప్పుడే సీజెరియన్ చేసి ఉంటే తమ పాప బతికేదని వాపోయారు. ఇది డాక్టర్ల నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మునీరు మింగడం వల్లే మృతి..
రోగులపై నిర్లక్ష్య దోరణి వహిస్తున్నారని చెప్పడం అవాస్తవమని సూపరింటెండెంట్ ఇందిర తెలిపారు. శిశువు ఉమ్మునీరులో మలం కూర్చోవడం జరిగిందని అట్టి ఉమ్మునీరు తాగడం వల్లే శిశువు మృతి చెందినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటలను చా లా అరుదుగా జరుగుతాయని, మలం కలిసి న ఉమ్మునీరు తాగడం వల్ల కొందరు పూర్తిగా అవయాలు కోల్పోతారని కానీ దురదృష్టవశాత్తు బిడ్డ మృతి చెందడం జరిగిందన్నారు.
పూర్తి విచారణ జరిపిస్తాం : కలెక్టర్
జిల్లా దవాఖానను ఆకస్మిక తనిఖీ చేస్తున్న సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ మీనా క్షి బంధువులు తమ ఆవేదనను తెలిపారు. డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే తామ బిడ్డను కోల్పోవలసి వచ్చిందని ఆరోపించా రు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ఘటనపై డా క్టర్లతో మాట్లాడారు. శిశువు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.