గ్యాస్ కోసం గంటల తరబడి..
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో గ్యాస్ కోసం గంటల తరబడి కస్టమర్లు నిరీక్షిస్తున్నారు. ఇంతకుముందు సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకున్న ఒకటి, రెండ్రోజుల్లో డెలివరీ అయ్యేవి.. కానీ కొన్ని రోజులుగా బుక్ చేసుకున్నా రావడం లేదంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
- కొల్లాపూర్‌లో సిలిండర్ల కోసం వినియోగదారుల పడిగాపులు
- బుక్ చేసుకున్నా.. డెలివరి ఇవ్వడం లేదంటూ ఆగ్రహం
- బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపణ
కొల్లాపూర్, మార్చి 11 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో గ్యాస్ కోసం గంటల తరబడి కస్టమర్లు నిరీక్షిస్తున్నారు. ఇంతకుముందు సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకున్న ఒకటి, రెండ్రోజుల్లో డెలివరీ అయ్యేవి.. కానీ కొన్ని రోజులుగా బుక్ చేసుకున్నా రావడం లేదంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం పట్టణ ంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని గంటల తరబడి క్యూలో ని లబడ్డారు. బారులు తీరిన కస్టమర్లను చూసి తనకు సిలిండర్ వస్తుందో? రాదో? అన్న బెంగతో 70 ఏండ్ల వృద్ధురాలు నారాయణమ్మ కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. మరో మహిళ చంటి పిల్లవాడితో ఎర్రని ఎండలో నిలబడింది. మంత్రి జూపల్లి ఇలాకాలో గ్యాస్ కోసం ఇబ్బందులు పడ్తుంటే పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపించారు.
బుక్ చేసుకున్న వారికి సిలిండర్లు ఇప్పటికే డెలివరీ చేశామని ఏజెన్సీ డీలర్, సిబ్బంది చెప్పడంతో కస్టమర్లు షాక్‌కు గురయ్యారు. మాకు సిలిండర్లే రాలేదంటూ పలువురు వారిని నిలదీయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏజెన్సీ డీలర్‌ను వివరణ కోరగా.. రోజు విడిచి రోజు కొల్లాపూర్‌కు 342 గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయని, మొత్తం 18 వేల కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. బయట మార్కెట్లోకి ఎలా వెళ్లాయో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

