KTR | ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం : అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు హరీశ్ రావుతో కలిసి హాజరయ్యారు. పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు వేలాది మంది తరలివచ్చారు.
లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారుఆయన ఎలాంటి వ్యక్తే తెలుపడానికి ఇదే నిదర్శమన్నారు. పెద్ది కోరుకున్నట్లు వచ్చే రెండేండ్లలో అధికారంలోకి వస్తామన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామన్నారు. భవిష్యత్ తరాలు గుర్తు చేసుకునే విధంగా ఘన నివాళులు అర్పిద్దామన్నారు.
ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం
దానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం
లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి… https://t.co/ET9h0yssd5 pic.twitter.com/98fJgTCHzS
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026