Rain | బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో ఫుల్లుగా వర్షాలు..!
Rain | బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం అంటే ఈ నెల 19 సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Rain : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం అంటే ఈ నెల 19 సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ అల్పపీడనం రాబోయే మూన్నాలుగు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడనుందని అధికారులు తెలిపారు. అనంతరం ఇది దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలవైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే వారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టంచేసింది.
వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా గమనించాలని అధికారులు కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

