Singapore Bonalu | సింగపూర్: ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS)’ ఆధ్వర్యంలో ఆగస్టు 9 సాయంత్రం బోనాల జాతరను కనులపండువుగా నిర్వహించారు. ఈ వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’లోని శ్రీ అరసకేసరి శివాలయంలో భక్తిశ్రద్ధలతో చేపట్టారు. పోతరాజులు, పులివేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. తెలుగు వారందరు సుమారు 850 నుంచి 900 మంది వరకు ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో అమ్మవారి, బోనాలకు సంబంధించిన పాటలకు చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ సంప్రదాయంలో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగను తెలుగు వారందరు జరుపుకోవడం సంతోషంగా ఉందని టీసీఎస్ఎస్ సభ్యులు అన్నారు.
బోనాల జాతరలో పోతరాజు, పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ సాయి కుమార్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మీపతి, అరవింద్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో శశిధర్ రెడ్డి, రమేష్ గడప, అలేఖ్య దార, అలేఖ్య తడిసిన, దీపా రెడ్డి మండల, బోయిని స్వరూప, శ్వేత కుంభం, బర్ల అరుణ్‌కుమార్, బైలపూడి గౌరీ వరలక్ష్మి, మోతె శ్రీనివాస రెడ్డి, బొందుగుల ఉమారాణి, అన్ను సుజాత ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) బహుమతులు అందజేశారు. వీరితో పాటు గడప రమేశ్, బసిక ప్రశాంత్ కుమార్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.
సింగపూర్ బోనాలు 2026లో పాల్గొని విజయవంతం చేసిన, ఎల్లప్పుడూ సొసైటీకి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవికృష్ణ విజ్జాపూర్, పెరుకు శివరామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్, యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం, సుఖేందర్ నీలం ధన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుకలకు మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏవీఎం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్), స్వాతి ఖానాపురం, సాయికృష్ణ కొమాకుల, నగేశ్ టేకూరి, నిఖిల్ పారుపల్లి, శ్రీధర్ మారోజు ఫ్రెండ్స్, రామాంజనేయులు చమిరాజు, అజయ్ నందగిరి, నరేష్ కుమార్ నౌల్ల, అభిమల్ల గిరి ప్రసాద్, కొల్లా శివ ప్రసాద్, మునిగెల కృష్ణంరాజు, పాతూరి రాంబాబు, దండా నాగేశ్వర్ రెడ్డి, రెడ్డిపల్లి కృష్ణారావు, రవీంద్ర కుమార్ సహకారం అందించారు. ఈ వేడుకలకు కృష్ణ నెల్లుట్ల ఫొటోలు తీశారు. యసరావేణి విజయ కుమార్ మెరుగు సౌండ్ సాంకేతికత అందించారు.