తిరుమల : తిరుపతికి చెందిన వేంకటేశ్వర మోటార్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ లోకనాథ రెడ్డి సోమవారం రూ.15.24 లక్షలు విలువైన ఎస్.ఎం.ఎల్.మహీంద్ర ట్రక్ ను విరాళంగా( Truck Donation ) అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు వాహన తాళాలను అందజేశారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం 87,179 మంది భక్తులు దర్శించుకోగా 34,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి 4.59 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 4.03 లక్షల లడ్డూలను విక్రయించామని, 3,11 లక్షల మందికి అన్నప్రసాదం అందజేశామని టీటీడీ అధికారులు వివరించారు.