కమాన్పూర్, సెప్టెంబర్ 17: తెలంగాణ అథ్లెట్ నల్లవెల్లి ఆనంది సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రెండు పతకాలతో ఆకట్టుకుంది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన ఆనంది అండర్-18 బాలికల 400 మీటర్ల విభాగంలో స్వర్ణం, 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించింది.
పుదుచ్చేరిలో గురువారం జరిగిన 400 మీటర్ల ఫైనల్లో అందరికంటే వేగంగా 56.42 సెకండ్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. 200 మీటర్ల తుదిపోరులో 25.66 సెకండ్లలో మూడో స్థానం సాధించింది.