సినిమా రిలీజ్ తర్వాత జడల్ అని పిలుస్తారు
‘ప్రేక్షకులకు గొప్ప మాస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ‘ది ప్యారడైజ్'. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ నెల 24న చూస్తారు. చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా తీశారు. నా గత చిత్రాలకు తమిళ ప్రేక్షకులు మంచి సపోర్ట్ ఇచ్చారు. నా కెరీర్లో ఇంత కష్టపడ్డ సినిమా లేదు.
‘ప్రేక్షకులకు గొప్ప మాస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ నెల 24న చూస్తారు. చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా తీశారు. నా గత చిత్రాలకు తమిళ ప్రేక్షకులు మంచి సపోర్ట్ ఇచ్చారు. నా కెరీర్లో ఇంత కష్టపడ్డ సినిమా లేదు. కచ్చితంగా ఈ సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మీరంతా నన్ను ‘నాని’ అని పిలుస్తున్నారు. రేపు ఈ సినిమా విడుదలయ్యాక అంతా ‘జడల్’ అని పిలుస్తారు. సుబ్బుగా చేసిన కయాదు లోహర్, కీర్తి సురేశ్ క్యామియో.. అనిరుధ్ సంగీతం ఈ సినిమాను నెక్ట్స్ లెవల్లో నిలబెట్టాయి’ అని అగ్ర కథానాయకుడు నాని అన్నారు.
ఆయన హీరోగా రూపొందిన పీరియడ్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’. కయాదు లోహర్ కథానాయిక. మోహన్‌బాబు ప్రత్యేక పాత్ర పోషించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా పానిండియా స్థాయిలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం చెన్నైలో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడారు. ప్యారడైజ్ ఓ రెవల్యూషనరీ ఫిల్మ్ అని, నాని ఇందులో రెబల్‌గా కనిపిస్తారని, తన ప్రాంతం కోసం, ఉనికి కోసం, ప్రజల కోసం , తల్లి కోసం తను ఎలా పోరాడాడు అనేది ఇందులో ప్రధానాంశమని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారు. ఈ సినిమాను తమిళంలో విడుదల చేస్తున్న స్వరూప్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

