హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ షట్లర్ నిమ్మ శాన్వి రెడ్డి మరో జాతీయ స్థాయి టోర్నమెంట్లో సత్తా చాటింది. ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ నెగ్గిన ఆమె సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది.
కోల్‌కతాలో జరిగిన అండర్-13 డబుల్స్ ఫైనల్లో శాన్వి-ల్యోషా ద్వయం 16-14, 15-6తో వరుస గేమ్స్‌లో మహారాష్ట్రకు చెందిన హజెల్ జోషి-దివిషా సింగ్ ద్వయంపై విజయం సాధించింది. సింగిల్స్‌లో టాప్ సీడ్ శాన్వి 10-15, 12-15తో రాష్ర్టానికే చెందిన ల్యోషా చేతిలో ఓడి రన్నరప్ ట్రోఫీ అందుకుంది.