మహేశ్‌బాబుతో భన్సాలీ సినిమా?
అగ్ర హీరో మహేశ్‌బాబుతో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారా? అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సంజయ్‌లీలా భన్సాలీ ఇటీవలే మహేశ్‌బాబుని కలిసి కథ చెప్పారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అగ్ర హీరో మహేశ్‌బాబుతో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారా? అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సంజయ్‌లీలా భన్సాలీ ఇటీవలే మహేశ్‌బాబుని కలిసి కథ చెప్పారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భన్సాలీ శైలి భారీ సెట్లు, గ్రాండ్ విజువల్స్, బలమైన భావోద్వేగాలతో సాగే పీరియాడిక్ కథ ఇదని ప్రచారం జరుగుతున్నది. గతంలో కూడా అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి అగ్ర హీరోలతో సంజయ్‌లీలా భన్సాలీ సినిమా చేయొచ్చనే వార్తలొచ్చాయి.
అయితే ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు-భన్సాలీ ప్రాజెక్ట్‌పై జరుగుతున్న ప్రచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘వారణాసి’పైనే తన దృష్టిని కేంద్రీకరించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇక సంజయ్‌లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే మహేష్‌బాబు-సంజయ్‌లీలా భన్సాలీ సినిమాపై స్పష్టత వస్తుందంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

