న్యూయార్క్ : ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్‌తో 80 మంది ఉద్యోగులను అమెరికా కంపెనీ తొలగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాకు చెందిన ఫిన్ టెక్ డిజిటల్ బ్యాంకింగ్ కంపెనీ బ్లూవైన్ ‘ఇండియన్ సపోర్టింగ్ టీమ్’లో పనిచేస్తున్న 80 మందిని తొలగించింది. బాధిత ఉద్యోగులు చెప్పిన వివరాల ప్రకారం..
బుధవారం ఇంటి నుంచే పనిచేయాలని సదరు ఉద్యోగులకు కంపెనీ సూచించింది. సాయంత్రం 6.30 గంటలకు షిఫ్ట్ ప్రారంభించిన ఉద్యోగులను రాత్రి 9.30గంటలకు మేనేజ్ మెంట్ గూగుల్ మీట్‌కు ఆహ్వానించింది. ఐదు నిమిషాల కాల్లో ఇండియన్ సపోర్టింగ్ టీమ్ మొత్తాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ టీమ్ పనితీరు సరిగ్గా లేదని మేనేజ్మెంట్ వెల్లడించింది.