మందుల దుకాణాల్లో సీసీటీవీలు తప్పనిసరి
ఇకపై మందుల దుకాణాల్లో సీసీటీవీ నిఘాను తప్పనిసరి చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదిస్తున్నది. నిర్దేశిత హెచ్, హెచ్1, ఎక్స్ క్యాటగిరీ ఔషధాల అమ్మకాలపై నిఘా కోసం ఈ చర్య చేపట్టనుంది.
- కేంద్రం ప్రతిపాదన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 : ఇకపై మందుల దుకాణాల్లో సీసీటీవీ నిఘాను తప్పనిసరి చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదిస్తున్నది. నిర్దేశిత హెచ్, హెచ్1, ఎక్స్ క్యాటగిరీ ఔషధాల అమ్మకాలపై నిఘా కోసం ఈ చర్య చేపట్టనుంది. విస్తృతశ్రేణి ప్రిస్క్రిప్షన్ మందులు (వైద్యుల సూచనలతో వాడే మందులు)ను హెచ్ శ్రేణిగా, అదనపు పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ అవసరమయ్యే కొన్ని నిర్దిష్ట మందులను హెచ్1లోకి, అత్యంత కఠినమైన నియంత్రణలు కలిగిన మందులను ఎక్స్ శ్రేణిగా పరిగణిస్తారు.
ఈ మూడు శ్రేణులకు చెందిన ఔషధాల అమ్మకాలు, పంపిణీని నియంత్రించడానికి, సరైన వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకాలు నిరోధించడానికి, రిటైల్ దుకాణ అమ్మకాల్లో పారదర్శకత, బాధ్యత పెంచడానికి, ఔషధ సరఫరా చైన్‌ను నియంత్రించడానికి ఈ చర్యలను ప్రతిపాదిస్తున్నారు. దీనిపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

