హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తేతెలంగాణ) ః ప్రపంచ రైల్వే టెన్నిస్ చాంపియన్ షిప్లో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ లాలాగూడ వర్కషాప్లో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పీసీ విఘ్నేశ్ స్వర్ణ పతకం సాధించారు. ఈనెల 11 నుంచి 16 వరకు బల్గేరియాలో జరిగిన యూనియన్ స్పోర్టివ్ ఇంటర్నేషనల్ డెస్చెమినోట్స్ (యూఎస్‌ఐసీ)లో ఆయన సత్తాచాటా రు. 2007 నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్న ఆయన ఇప్పటివరకు 5 పసిడి, ఒక రజత పతకంతో సహా మొత్తం ఆరు పతకాలను గెలిచారు.