Khammam | ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి చెదింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురికావటంతో బాలిక తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం బాలికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో.. వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అక్కడ వైద్యులు ఈసీజీ నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈమేరకు బాలిక తండ్రి ఆర్ఎంపీ వైద్యుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆర్ఎంపీ వైద్యుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి
వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యుల ఆరోపణ.. పరారీలో వైద్యుడు
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురికావటంతో… pic.twitter.com/ClhdtqYfR8
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026