ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన : సీఎస్ సంజయ్ జాజు
సెప్టెంబర్ 17 వ తేదీన హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ఉపరాష్ట్రపతి సి.పీ. రాధా కృష్ణన్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15: సెప్టెంబర్ 17 వ తేదీన హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ఉపరాష్ట్రపతి సి.పీ. రాధా కృష్ణన్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, పోలీసు అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.ఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ.. ఈనెల 17 న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిం చే తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలోముఖ్య అతిధిగా పాల్గొనడానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తున్నారని తెలిపారు. 17 న ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకొని ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖలు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నాయని అన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, హైదరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్లు సజ్జనార్, సుమతి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | దద్దరిల్లిన జియో లిస్టింగ్.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గ్రాండ్ ఎంట్రీ
Supreme Court | ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
Musi Project | మూసీ ముసుగులో లూటీ.. గుట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ .. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం
T20I | విజయంతో ముగించారు.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసిన భారత్
Voter Registration | ఓటు నమోదులో గ్రాడ్యులేట్..! మందకొడిగా ఓటర్ల నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

