Matt Renshaw : మూడేళ్ల తర్వాత టెస్టుల్లో పునరాగమనం అదరకున్నా వన్డేల్లో మాత్రం దంచేశాడు మ్యాట్ రెన్షా(Matt Renshaw). బంగ్లాదేశ్‌పై తీవ్రంగా నిరాశపరిచిన అతడు జింబాబ్వేపై చితక్కొట్టాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన తొలి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుర్రాడు శతకం బాదేశాడు. బ్రాడ్ ఎవాన్స్ ఓవర్లో సింగిల్ తీసిన అతడు 50 ఓవర్ల ఫార్మాట్లో మొదటి సెంచరీ నమోదు చేశాడు.
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన ఆస్ట్రేలియా కుర్రాడు మ్యాట్ రెన్షా వన్డేల్లో శతక్కొట్టాడు. మంగళవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జింబాబ్వే బౌలర్లను ఈ లెఫ్ట్ హ్యాండర్ ఉతికేశాడు. టాపార్డర్ విఫలమైనా వన్డేల్లో మొదటి సెంచరీతో జట్టుకు భారీ స్కోరందించాడు. 107కే నాలుగు వికెట్లు పడిన వేళ.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చి ధనాధన్ ఆటతో అలరించిన అతడు 94 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 109 రన్స్ సాధించాడు.
Matt Renshaw stars with his maiden ODI hundred as Australia pile up 294 in the series opener in Harare https://t.co/LcGRShFtdc pic.twitter.com/HGGSu5KODQ
— Cricinfo (@cricinfo) September 15, 2026
ఆతిథ్య బౌలర్లను ఎడాపెడా ఉతికేస్తూ.. అలెక్స్ క్యారీ, ఓలీ పీకేలతో కలిసి రెన్షా విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు రెన్షా. దాంతో, ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న ఆస్ట్రేలియాకు.. రెన్షా రూపంలో ఆరో స్థానంలో అదరగొట్టే బ్యాటర్ దొరికాడు. ఈ సెంచరీతో అతడు వన్డే జట్టులో తన స్థానం పదిలం చేసుకుంటాడా? లేదా? అనేది త్వరలోనే తెలియనుంది.