Nature Farming | రాయపోల్, సెప్టెంబర్ 15 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) పథకం గురించి రైతులకు అవగాహన కల్పించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) పథకంలోని రైతులకు అందించే ఫార్మర్స్ కిట్లను వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేందర్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం, రాయపోల్ మండలంలో సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా స్వరూప రాణి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతోపాటు నేల ఆరోగ్యం, కు ప్రాధాన్యత ఇవ్వవచ్చని తెలిపారు. రైతులు జాతీయ పకృతి వ్యవసాయ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించాలని సూచించారు. హాజరైన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. సహజ వ్యవసాయం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించడంతోపాటు నేల సారాన్ని పెంపొందించి, నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని, ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రధాన లక్ష్యం రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, స్థానిక వనరులతో సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం అని వారు రైతులకు వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న సహజ వ్యవసాయ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ఎందుకు ముఖ్యమైనది అని రైతులకు ఈ క్రింది విధంగా వివరించారు. రైతులకు సాగు ఖర్చు తగ్గుతుంది. రసాయన ఎరువులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. నేల సారం, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలంలో స్థిరమైన దిగుబడులు పొందవచ్చు. ఆరోగ్యానికి రసాయన అవశేషాలు తక్కువగా ఉన్న ఆహారం లభిస్తుంది. ఆరోగ్యకరమైన, సురక్షితమైన ఆహారం తీసుకునే అవకాశం పెరుగుతుంది. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. నేల, నీరు, గాలి నాణ్యత మెరుగుపడుతుంది అని సూచించడం జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమంలో జీవామృతం, బీజామృతం, నిమాస్త్రం, అగ్నియాస్త్రం, బ్రహ్మాస్త్రం తయారీ విధానాలు, వాటి వినియోగం, సహజ వ్యవసాయంలో అనుసరించాల్సిన మెళకువలపై రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వం బోనస్ ఇస్తున్న 7 వరి సన్న రకాలు సాగు చేస్తున్న రైతులు విత్తనాలు కొన్న విత్తన డీలర్స్ వద్ద 17/09/2026 లోపు నమోదు చేసుకోవాలి అని లేదా రైతు సొంత ఇంటి విత్తనాలతో పండిస్తే స్వీయ దృవీకరణ ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి అని సూచించారు.
అదే విధంగా ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామాలలో డిజిటల్ విధానంలో క్రాప్ బుకింగ్ జరుగుతుంది. కావున రైతు సోదరులందరూ పంట నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, ఆరేపల్లి సర్పంచ్ దివ్య కృష్ణ, ఏఎంసీ/ఆత్మ డైరెక్టర్లు మల్లేష్, జాని గౌడ్, ఏఈఓలు రజిత, శిరీష , రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్
హయత్నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు