– బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్
– కళాకారులకు డప్పులు అందజేత
అర్వపల్లి, సెప్టెంబర్ 15 : ప్రజా, సాంస్కృతిక కార్యక్రమాల్లో డప్పు కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, దాత మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అందించిన డప్పులను మంగళవారం కోడూరు గ్రామంలో పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా కొనసాగుతున్న డప్పు కళను, కళాకారుల సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు దాతగా ముందుకు వచ్చి డప్పులను అందించిన మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నిద్ర సంతు, మండల నాయకులు గుండగాని వెంకన్న, గంట పెద్ద వెంకులు, గంట ఎల్లయ్య, రామచంద్రం, కలకోట్ల ఎల్లయ్య, పల్లెర్ల సైదులు, జీడి రమేష్, గంట సోమనాదం, పలేర్ల సైదులు, జీడి రమేష్, గంట వెంకన్న, సతీష్, సైదులు, నాయకులు, కార్యకర్తలు, డప్పు కళాకారులు పాల్గొన్నారు.