Shah Rukh Khan | టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పై తనకున్న అభిమానాన్ని, ఆయన సినిమాల ప్రభావం తనపై ఎంత ఉందో పంచుకున్నారు.
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి గారంటే తనకు ఎంత అభిమానమో, బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ అంటే కూడా తనకు అంతే వీరాభిమానమని శ్రీకాంత్ ఓదెల తెలిపారు. తన బాల్యంలో హిందీ భాష సరిగ్గా రాకపోయినా, తన తల్లినో వెంటబెట్టుకుని మరీ షారుఖ్ సినిమాలు చూసేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. షారుఖ్ ఖాన్ సినిమాల ద్వారా కలిగిన ప్రభావంతోనే తాను ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రకు ‘బిచ్చు సింగ్’ (Bichhoo Singh) అనే పేరు పెట్టినట్లు శ్రీకాంత్ వెల్లడించారు. షారుఖ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘జోష్’ (Josh) చిత్రంలోని ‘బిచ్చు గ్యాంగ్’ స్ఫూర్తితోనే ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఈ ప్రకటనతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.