ఆర్కేపురం, మార్చి 14 : ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల పంపిణీపై వివాదం చెలరేగింది. ప్రతి మ్యాచ్‌కు వేల సంఖ్యలో ఉచిత పాస్‌లు వస్తున్నప్పటికీ అవి యువ క్రికెటర్లకు అందడం లేదని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతు ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కు సుమారు 4000 వేల ఉచిత పాసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అందుతున్నాయని తెలిపారు.
అయితే ఆ పాసులను అసోసియేషన్ అధికారులు తమ వద్దే ఉంచుకుంటున్నారని, క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఈ పాస్‌లను ముందుగా హెచ్‌సీఏ, టీసీఏలో నమోదు చేసుకున్న యువ క్రికెటర్లకు ఇవ్వాలని టీసీఏ డిమాండ్ చేసింది. క్రికెట్ అభివృద్ధి చెందాలంటే ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిందేనని పేర్కొన్నారు.