Revanth Reddy | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగా ణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేల భయం పట్టుకున్నదా? ఎమ్మెల్యేలపై తన వారిపై తన పట్టుతప్పుతున్నదనే ఆందోళనలో ఉన్నా రా? ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇందుకు సీఎల్పీ మీ టింగ్‌ను వేదికగా చేసుకున్నారా? పలువురు ఎమ్మెల్యేలను టార్గెట్‌గా వార్నింగ్‌లు ఇచ్చారా? ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్య లు, రహస్య సమావేశాలు సీఎంకు చి కాకు తెప్పిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాల నుంచి అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. సోమవారం అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. కొంద రు ఎమ్మెల్యేలే టార్గెట్‌గా పలు కీలక వ్యాఖ్యలు చేశారని పార్టీలో చర్చించుకుంటున్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఇటీవల బ్రా హ్మణులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయనే ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొన్నది. మరో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలంగాణలో మళ్లీ సారా దుకాణా లు తెరువాలని, సారా విక్రయాలకు అనుమతులు ఇవ్వాలని ఇటీవల వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే లేపింది. వీటికితోడు స్వపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తరచూ సీఎంపై, అధిష్ఠానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలెవరూ కూడా తన అదుపు అజ్ఞలో లేరని, ఒకవేళ ఉండిఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావనే అభిప్రాయం ఆయన వ్యక్తంచేశారని తెలిసింది. అందుకే ఎమ్మెల్యేలంతా ఒకచోట కలిసే సంద ర్భం కోసం కొద్ది నెలలుగా సీఎం ఎదురు చూస్తున్నారని, సీఎల్పీ సమావేశాన్ని ఇందుకు వేదికగా మార్చుకున్నారని చెప్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను సొంత పార్టీ ఎమ్మెల్యే లే బహిరంగ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న ది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, మం త్రులు మీడియాతో సన్నిహితంగా ఉండటంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తంచేశారని తెలిసింది. అందుకే ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారని, ఇకపై ఎవరూ కూడా మీడియాతో చిట్చాట్లు చేయొద్దని గట్టి హెచ్చరిక చేశారని సమాచారం.
ఎమ్మెల్యేలు తనకు దూరం అవుతున్నారనే విషయం సీఎం రేవంత్‌రెడ్డికి బోధపడిందని పార్టీలో చర్చ జరుగుతున్నది. తన తప్పు తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇకపై ఎమ్మెల్యేలకు సమయం ఇస్తానంటూ సీఎల్పీ సమావేశంలో చెప్పారని తెలిసింది. తనపై, మంత్రులపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించిన ట్టు తెలిసింది. అందుకే ఇకపై నుంచి మంత్రులు తప్పనిసరిగా ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని, వారు అడిగిన పనులు చేసి పెట్టాలని మంత్రులను ఆదేశించారని తెలిసింది. ఇకపై తాను కూడా ఎమ్మెల్యేలకు సమయం ఇస్తానని చెప్పారని తెలిసింది. దీంతో ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వలేదని ఆయన ఒప్పుకున్నట్టయ్యిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం తన బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు, ఎమ్మెల్యేలను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు వార్నింగ్ బాటను ఎంచుకున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
పలువురు ఎమ్మెల్యేలతోపాటు రెబల్ ఎ మ్మెల్యేల గ్రూప్ ఇప్పటికే పలుమార్లు రహస్యంగా సమావేశమైంది. నాలుగైదు రోజుల క్రితం మరోసారి సమావేశమయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరంతా సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా సీక్రెట్ మీటిం గ్ పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే తన పదవికి ఎక్కడ ఎసరు తెస్తాయోననే ఆందోళనలో సీఎం ఉన్నారని తె లిసింది. అందుకే రహస్య సమావేశాలపై సీ ఎల్పీ సమావేశంలో పరోక్షంగా వ్యాఖ్యా నించినట్టు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్టు సమావేశాలు నిర్వహించుకోవడం పరిపాటిగా మారిందని, పద్ధతి మా ర్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారట. ముందు గా పార్టీకి సమాచామిచ్చి మీటింగ్ పెట్టు కోవాలని ఆదేశించారని సమాచారం.