హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని పోతులబోగుడలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో సోమవారం మెదక్ జిల్లా రేగోడ్ మండలం మక్తవెంకటపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ కేశబోయిని రమేశ్, సీనియర్ నాయకులు సంగయ్య, మల్లయ్య, కాంగ్రెస్ పార్టీని వీడి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ చేరారు.
- అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
- గులాబీ కండువా కప్పుకొన్న కాంగ్రెస్ నేతలు
వట్పల్లి / రేగోడ్, ఆగస్టు 10: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని పోతులబోగుడలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో సోమవారం మెదక్ జిల్లా రేగోడ్ మండలం మక్తవెంకటపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ కేశబోయిని రమేశ్, సీనియర్ నాయకులు సంగయ్య, మల్లయ్య, కాంగ్రెస్ పార్టీని వీడి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ చేరారు. అనంతరం వారికి గులాబీ కుండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని, అందుకే బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రైతులకు యూరి యా, కరెంట్ కష్టాలు తప్పడం లేదని, పంట రుణమాఫీ, తులం బంగారం వంటి హామీలు అములు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రభు త్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవస రం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ వరం చైర్మన్ వీరారెడ్డి, మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ రాజు, నాయకులు భూంరెడ్డి, నర్సింహులు, సంతోష్‌రావు, షాదుల్, గురునాథ్‌రెడ్డి, హన్మంత్, అంజయ్య, కిష్టయ్య, జైకుమార్, సాయి లు, రవి, నాగరాజు, మల్లేశం, రాజు, దేవయ్య, శ్రీకాంత్, శరణప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గ్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

