సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపధ్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్‌తో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ మైదానం, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణాలను సందర్శించారు.
సంగారెడ్డి, ఆగస్టు 10: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపధ్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్‌తో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ మైదానం, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణాలను సందర్శించారు. 15 ఆగస్టును పురస్కరించుకుని రాష్ట్రంలో అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలను జిల్లా కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్, ఎస్పీ సూచించారు. భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, వేదిక ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్, ఎస్పీ, జగ్గారెడ్డి కోరారు. కార్యక్రమంలో సంబంధిత ఆర్అండ్బీ అధికారులు, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, పోలీసుశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

