తేజ కొండపల్లి, గణేశ్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘ముగ్గురు కోతులు’. కార్తీక్ గరిమెళ్ల దర్శకుడు. శోభారాణి గరిమెళ్ల నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. మ్యూజిక్ ప్రమోషన్లో భాగంగా అగ్రనటుడు డా.రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమాలోని స్పెషల్ ఐటమ్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘కో కో కొకొరొకో..’ అంటూ సాగే ఈ పాటను రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. జగదీశ్ రాసిన ఈ పాటను ఎస్.సుహాస్ స్వరపరచగా లాస్యప్రియ ఆలపించారు. అమ్మాయితో ముగ్గురు హీరోలు వేసిన స్టెప్పులు ఈ పాటకు హైలైట్ కానున్నాయని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ నోముల, సమర్పణ: జీఎస్ఆర్ క్రియేషన్స్.