బడంగ్పేట్, సెప్టెంబర్20: బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనమిస్తున్నాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుర్రం గూడ హరిత పురి కాలనీ, సాయి హోమ్స్ కాలనీ, సిటీ సివిల్ కోర్టు కాలనీ, రోమా ఫేస్-1 కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
సర్కిల్ కార్యాలయం పక్కనే చెత్త పేరుకుపోతే పట్టించుకోని అధికారులు ఇతర కాలనీల సమస్యలు ఎలా పట్టించుకుంటారని మండిపడ్డారు. కనీసం చెత్తను కూడా తొలగించక పోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. రోడ్ల దుస్థితి అధ్వానంగా మారిందన్నారు. కార్యక్రమంలో ఏఈ హరీశ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, పెద్ద బావి ఆనంద్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.