బెంగళూరు: ఇంజినీరింగ్ విద్యార్థులను కొందరు వ్యక్తులు నిర్బంధించారు. వారి నుంచి డబ్బు దోచుకున్నారు. ఆ విద్యార్థుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక నిందితుడ్ని అరెస్ట్ చేశారు. (Engineering Students Held Hostage) కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 21న తెల్లవారుజామున బాగలూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులు రెండు బైకులపై మార్నింగ్ రైడ్‌కు వెళ్లారు. హోస్కోట్లోని రెస్టారెంట్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు.
కాగా, బెంగళూరు శివారులోని టోల్ ప్లాజా సమీపంలో ఆ విద్యార్థులను ఒక ముఠా అడ్డగించింది. వారిని కొట్టి మొబైల్ ఫోన్లు, బైక్‌లు లాక్కున్నారు. మేడహళ్లి సమీపంలోని ఒక షెడ్‌కు విద్యార్థులను తీసుకెళ్లారు. అక్కడ వారిని నిర్బంధించి డబ్బులు డిమాండ్ చేశారు. వారి వద్ద ఉన్న రూ.40,000 నగదు తీసుకున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి రూ.1.10 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత వారి బైకులు తిరిగి ఇచ్చారు.
మరోవైపు బాధిత విద్యార్థులు అవలహల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్, దోపిడీకి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒక నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మిగతా వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Unnao Rape Case | ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, తల్లి నిరసన.. లాక్కెళ్లిన పోలీసులు
Girl Dies oF Dog Bite | కుక్క కరవడంతో చికిత్స పొందిన బాలిక.. నెల తర్వాత మృతి