BCCI : తొలిసారి ఐసీసీ ఛాంపియన్లుగా చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఘనంగా సత్కరించింది. ఆదివారం కన్నులపండువగా జరిగిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బృందానికి ప్రత్యేక మెడల్స్ ప్రదానం చేశారు అధికారులు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీశ్ శుక్లా, జాయింట్ సెక్రటరీ ప్రభుతేజ్ సింగ్ భాటియా చేతుల మీదుగా మెడల్ స్వీకరించిన అనంతరం గ్రూప్ ఫొటో దిగారు.
భారత మహిళల క్రికెట్ జట్టును అందని ద్రాక్షలా ఊరించిన ఐసీసీ ట్రోఫీని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన కొల్లగొట్టింది. 23 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. కోట్లాదిమందిని సంబురాల్లో ముంచెత్తుతూ వన్డే ప్రపంచకప్ ఛాంపియన్‌గా అవతరించింది టీమిండియా. చరిత్రాత్మక విజయంతో మహిళా క్రికెట్లో నవ శకానికి నాంది పలికిన హర్మన్‌ప్రీత్ సేనను వార్షిక అవార్డుల వేడుకలో బీసీసీఐ ఘనంగా సత్కరించింది.
A historic triumph honoured 🏆
A prestigious felicitation of the ICC Women’s Cricket World Cup 2025 winners by BCCI Vice President Mr. @ShuklaRajiv and BCCI Hon. Joint Secretary Mr. @prabhtejb ✨#NamanAwards pic.twitter.com/OaGASjJKeW
— BCCI (@BCCI) March 15, 2026
వన్డే వరల్డ్‌కప్ 2025 విజేతలను వేదిక మీదికు అహ్వానించగానే ఆహుతులందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ మహిళా క్రికెటర్లను అభినందించారు. వైస్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, షఫాలీ వర్మ, అమన్‌జోత్ కౌర్, ప్రతీకా రావల్, రేణుకా సింగ్, రీచా ఘోష్, జి.కమలిని తదితరులు అవార్డులు అందుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతలు, అండర్19 ప్రపంచకప్ హీరోలు, టీ20 ప్రపంచకప్ విజేతలుకు కూడా బీసీసీఐ అవార్డులు ప్రదానం చేసింది