– మునుగోడులో రైతాంగ ధర్నా, భారీ ర్యాలీ
మునుగోడు, మార్చి16 : బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ కాల్వలు పూర్తి చేసి సాగునీరు అందించాలని అలాగే మునుగోడు మండలంలోని చెరువులు నింపి తమ పంట పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మునుగోడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, కలవలపల్లి మాజీ సర్పంచ్, రైతు గట్టుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి తాసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్రామాల్లో అనేక మంది రైతులు భూగర్భ జలాలపై ఆధారపడి వరి పంటను సాగు చేస్తున్నట్లు తెలిపారు. కాగా భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కావునా ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కాల్వలు పూర్తి చేసి మునుగోడు మండలానికి నీరు అందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉదయ సముద్రం రైతాంగ వేదిక ద్వారా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, పోలగోని సత్యం, బోలుగురి నరసింహ, సురిగి చలపతి, గురిజ రామచంద్రం, పోలగోని సైదులు గౌడ్, గజ్జల బాలరాజు, సుధాకర్, గోస్కొండ లింగయ్య, బూడిద లింగయ్య యాదవ్, జాజుల అంజయ్య, చిలుముల రాజు, చావల శ్రీను, నన్నురి వెంకటరెడ్డి, జిట్టగోని సైదులు, బొల్లు సైదులు, బండారు శ్రీనివాస్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.