న్యూఢిల్లీ : ప్రయాణాలు చేసేటప్పుడు చాలా మంది హోటళ్లకు చెందిన ఫ్రీ వైఫైని వాడుతుంటారు. ఫోన్ నెట్వర్క్ రానప్పుడు ఇది చాలా సౌకర్యవంతంగా ఉండొచ్చు. కానీ ఇది ఒక రకంగా మాల్వేర్ మోసంలో కూరుకుపోవడమే అని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా హోటళ్లు, ఇతర గెస్ట్‌ల ఉచిత వైఫై నెట్‌వర్క్‌లను ప్రపంచ వ్యాప్తంగా టార్గెట్ చేస్తున్నారని.. దీని ద్వారా మాల్వేర్ను యూజర్ల ఫోన్లోకి చొప్పించడానికి వారి పాస్‌వర్డ్‌లను దొంగిలించడానికి, కీలకమైన డాటాను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తారని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. హోటళ్ల ఉచిత వైఫైను 2026 మే నుంచి టార్గెట్ చేసుకుంటున్న క్యాప్టివ్ క్రంచ్ అనే సైబర్ ముఠాను మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించింది. రష్యాకు చెందిన మిడ్నైట్ బిజార్డ్ అనే గ్రూప్‌తో ఈ ముఠాకు లింక్ ఉంది.