Amazon Festive sale | మళ్లీ వస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఎప్పటి నుంచో తెలుసా..?
Amazon Festive sale | పండగ సీజన్ (Festive Season) సమీపిస్తుండటంతో ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 (Amazon Great Indian Festival 2026)" రాబోతోంది. ఫెస్ట్‌కు సంబంధించిన తేదీలను ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అతిపెద్ద సేల్‌గా అభివర్ణిస్తున్న ఈ ఫెస్టివల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది.
Amazon Festive sale : పండగ సీజన్ (Festive Season) సమీపిస్తుండటంతో ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 (Amazon Great Indian Festival 2026)” రాబోతోంది. ఫెస్ట్‌కు సంబంధించిన తేదీలను ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అతిపెద్ద సేల్‌గా అభివర్ణిస్తున్న ఈ ఫెస్టివల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది.
మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన “బిగ్ బిలియన్ డేస్ 2026” సేల్‌ను అక్టోబర్ 9న ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, అమెజాన్ వ్యూహాత్మకంగా ఒకరోజు ముందే తన సేల్‌ను మొదలుపెట్టి పోటీకి సై అంటోంది. ఈ సేల్‌లో భాగంగా ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈఎంఐ లావాదేవీలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని అమెజాన్ స్పష్టంచేసింది. ప్రైమ్ మెంబర్లకు కొన్ని ఎంపిక చేసిన ఆఫర్లపై అదనంగా 10% వరకు ప్రయోజనాలు ఉండనున్నాయి.
వీటితోపాటు స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, నిత్యావసరాలు వంటి అన్ని కేటగిరీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్, రాత్రి 8 గంటల డీల్స్ వంటి ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు అమెజాన్ సిద్ధమైంది. కేవలం డిస్కౌంట్లే కాకుండా ఈసారి షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వీటి ద్వారా వినియోగదారులు ఉత్పత్తులను సులభంగా పోల్చుకోవచ్చు, ధరల హెచ్చుతగ్గుల చరిత్రను చూడవచ్చు, మెరుగైన సిఫార్సులను పొందవచ్చు.
దేశవ్యాప్తంగా వేగవంతమైన డెలివరీని అందించే లక్ష్యంతో తన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించింది. ఇందులో భాగంగా 20 కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 6 కొత్త సార్ట్ సెంటర్లు, 150 కొత్త లాస్ట్-మైల్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దీపావళి నాటికి “అమెజాన్ నౌ” (నిత్యావసరాల క్విక్ కామర్స్) సేవలను 100 నగరాలకు విస్తరించాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌పై 17 లక్షల మందికి పైగా విక్రయదారులు ఉన్నారని, వీరి సంఖ్య 20 లక్షల మైలురాయిని దాటిందని కంపెనీ పేర్కొన్నది. సేల్ ఎప్పటివరకు కొనసాగుతుందనే విషయం ఇంకా వెల్లడి కాలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

