Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Upasana | దీపావళి పండుగను సినీ తారలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగ సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోల భార్యలు కూడా ప్రత్యేకంగా దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
Upasana | దీపావళి పండుగను సినీ తారలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగ సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోల భార్యలు కూడా ప్రత్యేకంగా దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌లతో కలిసి ఉపాసన దిగిన ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
దీపావళి సందర్భంగా ఉపాసన కొణిదెల తన స్నేహితులు, ఇతర ప్రముఖ మహిళలతో కలిసి ప్రత్యేకంగా ఓ గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. మహిళలు మాత్రమే పాల్గొన్న ఈ ప్రైవేట్ వేడుకలో వ్యాపారవేత్తలు, సన్నిహితులు, ప్రముఖ సామాజికవేత్తలు పాల్గొని సందడి చేశారు. పండుగ వాతావరణంలో అందరూ ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో అభిమానులకు స్టార్ హీరోల కుటుంబాల సందడి చూసే అవకాశం లభించింది.
ఈ ఫొటోల్లో ముఖ్యంగా ఒక చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో రామ్ చరణ్ భార్య ఉపాసన ఎరుపు రంగు చీరలో ఎంతో అందంగా కనిపించగా, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ఇద్దరూ కలిసి ఫొటోకు పోజివ్వడంతో అభిమానులు ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. అలాగే మరో ఫొటోలో ఉపాసన.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి కనిపించారు. వీరిద్దరితో పాటు మరికొందరు స్నేహితులు కూడా ఈ ఫొటోలో ఉన్నారు. అందరూ ఎంతో ఆనందంగా నవ్వుతూ ఫొటోలకు పోజులివ్వడం విశేషం. ఈ స్టార్ వైవ్స్ గెట్టుగెదర్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉపాసన షేర్ చేసిన ఈ ఫొటోలు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోల భార్యలను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రతల లుక్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పండుగ వేళ ఇలాంటి అందమైన కలయిక చూడటం చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

