Asian Games : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో(Asian Games) భారత్‌కు తొలి పతకం వచ్చేసింది. ఆటలు మొదలైన రెండో రోజే షూటర్ల బృందం రజతంతో మెరిసింది. ఆదివారం నిర్వహించిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగం ఫైనల్లో సత్తా చాటిన సోనమ్ ఉత్తమ్ మస్కర్, ఎలవెనిల్ వలరివన్, విడర్సా వినోద్‌లతో కూడిన త్రయం సిల్వర్ మెడల్ అందించింది. మరోవైపు మహిళల బ్యాడ్మింటన్ బృందం అదిరే విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఇరవయ్యో ఆసియా క్రీడల్లో షూటర్ల బృందం భారత్‌కు తొలి పతకం అందించింది. నొగయాలో ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో సోనమ్ ఉత్తమ్ మస్కర్, ఎలవెనిల్ వలరివన్, విడర్సా వినోద్‌లతో కూడిన టీమిండియా త్రయం సిల్వర్ మెడల్ ముద్దాడింది.
VIDEO | Nagoya, Japan: India’s shooting campaign at the Asian Games got off to a flying start on Sunday as Sonam Uttam Maskar, Elavenil Valarivan and Vidarsa Vinod combined to win the silver medal in the women’s 10m air rifle team event, giving the country its first medal from… pic.twitter.com/IktOTg8GDT
— Press Trust of India (@PTI_News) September 20, 2026
క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన మన షూటర్లు.. ఫైనల్లో మాత్రం కాసింత తడబడ్డారు. చైనా బృందం 1,904.2 పాయింట్లతో రికార్డు నెలకొల్పగా.. జపాన్ షూటర్లను వెనక్కి నెడుతూ భారత త్రయం 1898.0 పాయింట్లు సాధించింది. కేవలం 0.9 పాయింట్ల తేడాతో ఆతిథ్య దేశ షూటర్లు కాంస్యంతో సరిపెట్టుకున్నారు. సింగిల్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లోనూ మెరిసిన వలవరిన్ వెండి వెలుగులు విరజిమ్మింది.
మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు చెలరేగడంతో భారత బృందం క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో కజకిస్థాన్ షట్లర్లకు సింధు, ఉన్నాటి హుడా, తన్వీ శర్మలు చుక్కలు చూపించారు. కమలియాపై వరస సెట్లలో విరుచుకుపడిన తెలుగు తేజం 21-7, 21-9తో విజయం సాధించింది. అంతకుముందు.. ఉన్నాటి 21-7, 21-19తో అలిస్సాపై, తన్వి 21-5, 21-10తో డయానాపై గెలుపొందారు. మొత్తంగా ముగ్గురు కలిపి 65 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించగా.. భారత బృందం దర్జాగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
🇮🇳 PV Sindhu has taken game two at a canter, and with it the match: 21-7, 21-9. India lead 1-0, and India’s greatest-ever badminton player has given the badminton contingent’s campaign a solid start
Up next, Unnati Hooda vs Alissa Kuleshova 💪
▶️ Read more:… pic.twitter.com/CMCnoAF5Ve
— ESPN India (@ESPNIndia) September 20, 2026
ఆసియా క్రీడల అరంభ పోరులో భారత హాకీ జట్లు అదరగొట్టాయి. మహిళల, పురుషుల హాకీ జట్లు గోల్స్ వర్షంతో ముందంజ వేశాయి. ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 19-0తో మహిళల జట్టు ఘన విజయం సాధించింది. అనంతరం ఇండోనేషియాపై దిల్‌ప్రీత్ నాలుగు, సుఖ్జీత్ రెండు గోల్స్‌తో విజృంభించగా 13-1తో ఓడించింది హర్మన్‌ప్రీత్ సింగ్ సేన.