పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న కేంద్రం : పోలేపల్లి ఉదయ్‌కుమార్
కేంద్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాల నుండి పెట్టుబడి వర్గాన్ని పెంచి పోషిస్తుందని, నిరంతరం ప్రజలపై అధిక ధరల భారాన్ని మోపుతుందని సిపిఐ దామరచర్ల మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు..
దామరచర్ల, మార్చి 16 : కేంద్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాల నుండి పెట్టుబడి వర్గాన్ని పెంచి పోషిస్తుందని, నిరంతరం ప్రజలపై అధిక ధరల భారాన్ని మోపుతుందని సిపిఐ దామరచర్ల మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు దామరచర్ల మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్, నిత్యవసరాల ధరలను తగ్గించి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాసి, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఎప్పటికప్పుడు ధరలను పెంచుకుంటూ పోతూ సామాన్యుడి నడ్డి విరుస్తుందని దుయ్యబట్టారు. ఇకనైనా ధరలను నియంత్రించకపోతే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి దేశవ్యాప్త ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ధనావత్ శాంత, సీనియర్ నాయకులు జమ్ముల కోటయ్య, గజ్జల లక్ష్మీనరసింహారెడ్డి, భాగం శేషయ్య, శుద్ధబోయిన రాములు, వెంకన్న, వినయ్, యశ్వంత్, రమేశ్, నరసింహ, సాంబ, శివాజీ, రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- cpi
- damaracherla
- Nalgonda News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

