ముంబై: ఒక బాలికను కుక్క కరిచింది. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కోలుకున్న ఆ బాలిక ఇటీవల పుట్టిన రోజు జరుపుతున్నది. అయితే యాంటీ రేబిస్ టీకా చివరి డోస్ తర్వాత ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. రేబిస్ లక్షణాలతో మరణించింది. (Girl Dies oF Dog Bite) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 17న థానేలోని దివా ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటునన ఆరేళ్ల నిషా షిండేను కుక్క కరిచింది.
కాగా, నిషా తల్లిదండ్రులు వెంటనే స్థానిక వైద్యుడి వద్దకు ఆమెను తీసుకెళ్లారు. ఆ తర్వాత కళ్యాణ్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్క కరిచిన ఆ బాలికకు ప్రామాణిక చికిత్సను డాక్టర్లు అందించారు. క్రమానుసారం యాంటీ-రేబిస్ టీకా డోసులు ఇచ్చారు.
మరోవైపు ఆరోగ్యం కోలుకుంటున్నట్లుగా నిషా కనిపించింది. డిసెంబర్ 3న పుట్టినరోజు జరుపుకున్నది. అయితే యాంటీ రేబిస్ టీకా చివరి డోసు తీసుకున్న ఒక రోజు తర్వాత ఆ బాలిక ఆరోగ్యంలో మార్పు వచ్చింది. డిసెంబర్ 16న ఆ చిన్నారికి అధిక జ్వరం, తలనొప్పి వచ్చింది.
కాగా, నిషా ప్రవర్తనలో మార్పులు కూడా వచ్చాయి. మంచానికి తలను కొట్టుకోవడం, రక్కడం వంటి లక్షణాలు చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. డిసెంబర్ 17న కేడీఎంసీ ఆసుపత్రికి ఆ బాలికను తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆ చిన్నారిని తరలించారు. ఫలితం లేకపోకపోవడంతో రేబిస్ లక్షణాలతో ఆ బాలిక మరణించింది.
Also Read:
Watch: వీల్‌చైర్ అందుకున్న తర్వాత నడిచిన లబ్ధిదారుడు.. వీడియో వైరల్
Watch: మహిళను ఢీకొట్టిన ఆటో.. తర్వాత ఏం జరిగిందంటే?