– జీవాలు, పశువుల మేతకు వదిలేసిన రైతులు
రాజాపేట, మార్చి 10 : చెరువుల్లో నీటి చుక్క లేక భూగర్భ జలాలు అప్పుడే అడుగంటడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దాంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన సామల మురళికి చెందిన వ్యవసాయ పొలాన్ని అదే గ్రామానికి చెందిన రైతు రంగ వెంకటేశ్ కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. మూడున్నర ఎకరాల్లో రూ.60 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేశాడు. ఊరి శివారులో ఉన్న చెరువుల్లో నీళ్లు లేక ఎండిపోగా భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉన్న ఒక్క బోరు వట్టిపోయి సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. పొట్ట దశలో ఉన్న వరి చేను ఇప్పటికే సగం వరకు ఎండిపోయింది. చేసేదేమీ లేక రైతు ఎండిన పంట పొలాన్ని గొర్రెలకు, పశువులకు వదిలేశాడు.